వనపర్తి, నవంబర్ 5 : అంగన్వాడీ కేంద్రాల కు వచ్చే చిన్నారులు ఆడుతూపాడుతూ.., నీతి క థలు వింటూ పాఠాలను నేర్చుకుంటారు. మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ చిన్నారుల్లో ఆలోచనలు రేకిత్తిస్తూ మేథోశక్తిని పెంచేందుకుగానూ ప్రభుత్వం చర్యలు తీసుకున్న ది. చిన్నతనంలోనే భవిష్యత్‌కు అవసరమైన కార్యక్రమాలపై దృష్టి మళ్లిస్తే.. చిన్నారులు ఎంతో ఎత్తు కు ఎదిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రతి అం గన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ విద్యను అందిస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా వనపర్తి జిల్లాలో ప్రీ స్కూల్ విద్యకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ టీచర్లు అందిస్తున్న విద్య ను యూట్యూబ్ ఛానల్ నుంచి లింక్‌లను తయారుచేసి పంపిస్తున్నారు. జిల్లాలో 589 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ విద్య అందుతున్నది.
వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ..
చిన్నారుల ప్రతిభను అంచనా వేసేందుకు ప్రీ స్కూల్ అసైన్మెంట్ కార్డులు తయారు చేసి కేం ద్రాలకు పంపారు. మూడేండ్లు పై బడిన వారికి ఆ కుపచ్చరంగు, నాలుగేండ్లు పై బడిన వారికి నీలిరంగు కార్డులిచ్చారు. నిత్యం గణిత బోధన, తెలు గు, అభ్యసన కరదీపిక, పరిసరాలపై అవగాహన పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తయారుచేసిన పుస్తకాలు, ఇంగ్లిష్ వర్క్ పు స్తకాల్లో చుక్కలను కలుపుతూ బొమ్మలు గీయ డం, వస్తువులు చూసి పేర్లు రాయడం, అక్షరాలు, అంకెలు క్రమం తప్పకుండా చదివించడం తదితర పద్ధతుల్లో బోధన చేయిస్తున్నారు. పరీక్షల ఫలితాలను కార్డుల్లో నమోదు చేసి చిన్నారుల తల్లిదండ్రులకు అందజేస్తారు. వెనుకబడిన చిన్నారులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రీస్కూల్ ముఖ్య ఉద్దేశం..
అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగేండ్లలోపు చిన్నారులు జాయిన్ అవుతారు. వారికి మెదడు ఎదుగుదల 80 శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఆటలు, పాటల రూ పంలో అక్షరాలను గుర్తించడం వంటివి చేయిస్తే మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా బోధించడం వల్ల వారికి అర్థం అవుతుంది.
యూట్యూబ్‌లో విస్తృత ప్రచారం..
ప్రీ స్కూల్ విద్యలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 30 నుంచి 90 రోజుల శిక్షణ ఇస్తారు. ఇందులో చిన్నారులకు ఆటపాటల రూపంలో ఎలా విద్యనందించాలి అనే అంశాలపై వివరిస్తారు. కాగా, శిక్షణలో నేర్చుకున్న అంశాలను టీచర్లు విధిగా నిర్వర్తిస్తున్నారు. అయితే, నిత్యం టీచర్ అందిస్తున్న ప్రీ స్కూల్ విద్యతోపాటు వనపర్తి జిల్లాలో అధికారులు మరో అడుగు వేశారు. ఐసీడీఎస్ అధికారిణి పుష్పలత శుక్రవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం టీచర్లు చిన్నారులకు అందిస్తున్న విద్య, టీసాట్ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి అంగన్వాడీ టీచర్‌కు యూట్యూబ్ లింక్‌లను పంపిస్తున్నారు.