తిమ్మాజిపేట : తిమ్మాజీపేట మండల కేంద్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ( Veera Brahmandra Swamy) 332వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అభయాంజనేయ స్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణులు స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్తులో జరిగే విషయాలను తెలియచెప్పారని వారు తెలిపారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి మహాయోగి అని, ఆత్మ జ్ఞాన ప్రబోధకుడని, ప్రపంచానికి తత్వ బోధనలు చేసిన జగద్గురు అన్నారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశ్వబ్రాహ్మణుల ప్రతినిధులు సురేందర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.