ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై బీటీ కొట్టుకుపోయి కంకరతేలి అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు పాడవుతున్నాయని యజమానులు వాపోతుండగా.. ప్రయాణికులకు ప్రాణసంకటంగా తయారైంది. ఇక మట్టిరోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వర్షం పడితే చాలు అడుగుతీసి వేయలేని దుస్థితి నెలకొంటున్నది.
ఈ రహదారుల మీదుగా ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా.. పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్లీ దారుణాలు భరించాలని, మా కష్టాలు ఎప్పటికి ‘దారి’కొచ్చేనా..? అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఛిద్రమైన సడక్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 15
గద్వాల, సెప్టెంబర్ 15 : జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలుపడి.. బురదగా మారడంతో ప్రయాణం.. ప్రాణసంకటం గా మారింది. ఇప్పటికే వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. నిత్యం ఇవే రోడ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వి నిపిస్తున్నాయి.
స్థానిక రోడ్లు, భవనాలు, పీఆర్ శాఖ అధికారులు కార్యాలయాల్లో ఉండడం లేదని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని స్థానికు లు ఆగ్రహం చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ని పీఆర్ ఆఫీస్ ఎదుటే రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. అలాగే అంబేద్కర్చౌక్-బీరెల్లి చౌరస్తా వరకు, గద్వాల-అయిజ రోడ్డు, రైల్వేస్టేషన్-కొండపల్లి వరకు, గద్వాల-జూరాల డ్యాం రోడ్డు, గద్వాల-రాయిచూర్ రోడ్డు, ధరూర్-జాంపల్లి రహదారి, అలంపూర్ వయా అయిజ మీదుగా రాయిచూర్కు వెళ్లే అంతర్రా ష్ట్ర రోడ్డుపై మిట్టదొడ్డి స్టేజీ తర్వాత బలిగేర వర కు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నా రు.
మల్దకల్ మీదుగా ధరూర్, మార్లబీడు రో డ్డు అడుగడుగునా గుంతలుపడి అందులో వ ర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. అయిజ మండలం చిన్నతాండ్రపాడు, మేడికుంద రోడ్డు, గద్వాల మండలం మేలచెర్వు, బీ రెళ్లి రోడ్డు, మానవపాడ్, చెన్నిపాడ్ మీదుగా పోతులపాడు స్టేజీ వరకు, ఇటిక్యాల నుంచి శి వనంపల్లి మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. శాంతినగర్ నుం చి జిల్లెడుదిన్నె, రామాపురం బీటీరోడ్డు గుంత లు పడగా.. రాత్రివేళ వాహనా లు ప్రమాదాల కు గురవుతున్నాయి. అయిజ మండలం వెంకటాపురం స్టేజీ నుంచి ఇటిక్యాల మండలం వే ముల గ్రామ స్టేజీ రోడ్డుది కూడా ఇదే పరిస్థితి.
రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం ని ధులు విడుదల చేసినప్పటికీ పనులు చేపట్టడం లేదు. టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదని అధికారులు అంటున్నారు. గద్వాల ని యోజవర్గంలోని 150 కి.మీ. ఆర్అండ్బీ ర హదారుల మరమ్మతులకు సుమారు రూ.60 లక్షలు, అలంపూర్ నియోజకవర్గ పరిధిలో 70 కి.మీ. రోడ్ల రిపేర్లకు రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలాగే పీఆర్ పరిధిలో రోడ్ల మరమ్మతుకు ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల చొప్పున జిల్లాలో రూ.40 కో ట్లతో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపగా అనుమతులు రాలేదు.