నవాబ్‌పేట, మార్చి 25 : ‘ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన వరి పంట కండ్ల ముందే ఎండిపోతుంటే కండ్లలో నుంచి నీళ్లొస్తున్నయ్.. గిట్ల నీటి కరువు వస్తదని ముందే తెలిస్తే.. ఎవుసమే చెయ్యకుంటి.. ఇప్పుడు కౌలు డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.. మా ఊరి రైతు వద్ద మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి వేసిన.
దీంతోపాటు నాకున్న ఎకరా 20 గుంటల్లో నూ వరి పంట వేసిన. కౌలు పొలంలో నీళ్లు బాగానే ఉన్నాయని రెండు నెలల కిందట పంట వేస్తే.. 20 రోజుల నుంచి బోరులో నీళ్లొస్తలేవు.. ఇప్పటికే రెండెకరాల్లో పంట ఎండింది. ఎకరాకు మాత్రం తడి కడుతున్నా.. నా పొలంలో వేసిన పంట కూడా ఎ ండుముఖం పట్టింది.
దీంతో చేసేది లేక కౌలు పొ లంలో పంటను మేతకు వదిలేశాం. నాలుగేండ్ల కిం దట 180 ఫీట్లు బోరేస్తే నీళ్లు ఫుల్‌గా వచ్చాయి.. ఈతాపే దరిద్రంగా తయారైంది.. పంట పెట్టుబడికి రూ.1.10 లక్షలు ఖర్చు చేశాను. తెచ్చిన అప్పు ఎ లా తీర్చాలో అర్థమైత లేదు.’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పోమాల గ్రామానికి చెందిన రైతు గొడుగు కృష్ణయ్య, అతడి భార్య పావని ఆవేదన వెళ్లగక్కారు.