Polytechnic Students | పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలో నెట్టేసేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 97పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ముక్త కంఠంతో జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులంతా రోడ్డెక్కి తమను ఆగం చేయొద్దని.. సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్ ఎక్కడికక్కడ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ సమస్య పరిష్కారం దిశగా ఆందోళనలు చేపడుతోంది. ఈ క్రమంలో మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ర్యాలీలో మాస్ హిస్టీరియా కనిపించింది. జీవో 97ను రద్దు చేయాలని ప్రభుత్వంపై తిరగబడ్డ విద్యార్థులు.. మరోవైపు బీఆర్ఎస్ ఆంథెమ్ సాంగ్ దేక్ లేంగే పాటకు పాలిటెక్నిక్ విద్యార్థులు మాస్ స్టెప్పులేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు సపోర్ట్‌గా నిలుస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నిరసన ర్యాలీలో మాస్ హిస్టీరియా
జీవో నెంబర్ 97 రద్దు చేయాలని ప్రభుత్వంపై తిరగబడి, బీఆర్ఎస్ పాటకు మాస్ స్టెప్పులేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు pic.twitter.com/K12k0hQgs8
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు