కల్వకుర్తి, ఏప్రిల్ 20: ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటనలో తీగలాగితే డొంక కదలునుందా అంటే అవుననే స మాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారణ చేపటినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ నిందితులను డీ ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కోర్టు అనుమతితో 5రోజుల కస్టడీకి తీసుకున్నారు. మార్చి 28న ఊ ర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన వివాహితపై ఊర్కొండపేటకు చెందిన యువకులు సా మూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
నిందితులను గు ర్తించి వారిని రిమాండ్‌కు తరలించే వరకు ఎస్పీ గైక్వాడ్ దగ్గరుండి కేసు విచారణను చూసుకున్నారు. కేసును పూర్తి స్థాయిలో విచారించే బాధ్యత కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లుకు అప్పగించారు. లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులు వివరాలు వెల్లడించడంలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ గైక్వాడ్ లైంగిక దాడి కేసును మ రింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. నిం దితులను పోలీస్ కస్టడీకి తీసుకుంటామని, గతంలో ఇ లాంటి ఘటనలు జరిగాయనే వార్తల నేపథ్యంలో పూర్తి వివరాలు వెలికి తీస్తామని ఎస్పీ ప్రెస్మీట్లో చెప్పారు.
ఎస్పీ గైక్వాడ్ డైరెక్షన్లో కల్వకుర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో గ్యాంగ్‌రేప్ కేసుపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సానుకూలంగా స్పందించి నిందితులను 5రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించిం ది. ఈనెల 18న నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పూర్తి భద్రత మధ్య తమ విచారణ ప్రారంభించారు. సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ నిందితుల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 18న నలుగురిని, 19వ తేదీన ము గ్గురు నిందితులను విడివిడిగా విచారించారు. విచారణలో భాగంగా క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు.
నిందితులను ఒక్కొక్కరి ఘటనకు పాల్పడిన ప్రదేశానికి తీసుకొచ్చి ఏ విధంగా మహిళ సమాచారం తెలుసుకున్నారు. వివాహితోపాటు వచ్చిన వ్యక్తిపై ఏవిధంగా దాడికి పాల్పడి కట్టేశారు. మద్యం ఎవరు తీసుకొని తెచ్చి ఇచ్చారు. ఎక్కడ మద్యం తాగారు. లైంగిక దాడికి ఏ విధంగా పాల్పడ్డారనే విషయాలపై విచారించారు. అదేవిధంగా శనివారం మిగిలిన ముగ్గురిని కూడా ఘటనా స్థలానికి తీసుచ్చి వారితో కూడా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో నిందితులు గతంలో కూడా ఇలాం టి ఘటనలకు పాల్పడిన విషయాలను వెల్లడించినట్లు స మాచారం. ఊర్కొండపేట గుట్టలు అడ్డాగా ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారి సమాచారం కూడా పోలీసులు సేకరించనట్లు తెలుస్తుంది.
ఊర్కొండ పేట అభయాంజనేయ స్వామి ఆలయం ఉ న్న ప్రదేశాన్ని మహిమగల శక్తి స్థలమని భక్తులు భావిస్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని భక్తులే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. శనివారం రాత్రి నిద్ర చేస్తే మంచి జరుగుతుందనే భావనలో చాలామంది భక్తులు అలయం వద్ద నిద్రిస్తుంటారు. ఆలయాని రెండు వైపులా ఎతైన గుట్టలతో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉం టుంది.
కొత్త జంటలు, ప్రేమికులు దేవుని దర్శనం అనంతరం కొండలపైకి ఎక్కి ఏకాంతంగా ఉంటుంటారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది యువకులు గ్రూపులుగా ఏర్పడి ఏకాంతంగా ఉన్న జంటల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్ చేసి డబ్బులు వసూలు చేసేవారని.. డబ్బు వసూలు చేస్తున్నా.. ఈ విషయం బయటకు పొక్కకపోవడంతో సదరు యువకులు గ్రూపులు మరింత చెలరేగారు. లైంగిక దాడికి పాల్పడేంతగా చివరకు వివాహిత పై గ్యాంగ్ రేప్ ఘటన బయటకు రావడంతో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.
గతేడాది కల్వకుర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన జంట గుడికి వచ్చింది, వారు ఏకాంతంగా ఉండగా కొంతమంది వారిని బెదిరిం చి డబ్బులు వసూలు చేయడమే కాకుండా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన స్నేహితుడికి చెప్పడంతో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను చితకబాదినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇంటర్ చదువుతున్న విద్యార్థినీ మెడలోంచి గొలుసు లాక్కుంటే.. విషయం బయటకు పొక్కడంతో కొంతమంది పెద్దలు కలుగజేసుకుని సదరు విద్యార్థిని గొలుసు తిరిగి ఇప్పించినట్లు సమాచారం.
పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు ఏ విషయాలు చె బుతారో.. ఇంకా ఎంత మందికి ఈ ఉచ్చు చుట్టుకుంటుందనే భయంలో ఊర్కొండ మండలంలో కొంత మంది యువకులు భయంతో వణికిపోతున్నారు. గతంలో బ్లాక్‌మెయిలింగ్, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, భయపెట్టి లైంగిక దాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడ్డ విషయాలు బయట చక్కర్లు కొడుతుండడంతో పోలీసులు ఆదిశలో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.
ఇదంతా ఇలా ఉంటే గుడిలో పనిచేసే కొంతమంది పూజారులు తమ పబ్బం గడుపుకునేందుకు కొం తమంది యువకులను చేరదీసి వారికి ప్రోత్సహించారని సమాచారం. సదరు యువకులకు ఖర్చులు, మద్యానికి కొంతమంది పూజారులు డబ్బు సమకూర్చేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ఉత్సవాలు జరిగే సమయంలో పూ జారులు ప్రోత్సహించిన యువకులు చెలరేగిపోయే వా రని గ్రామస్తులు చెబుతున్నారు. యువకుల అండతో పూ జారులు ఎవరినైనా బెదిరిస్తారని భక్తులు వాపోతున్నారు.
గతంలో ఆలయ ఈవోపై ఒక పూజారి దాడికి పాల్పడ్డారు. సదరు ఈవో కల్వకుర్తి సీఐకి ఫిర్యాదు చేయగా.. పూజారి ని సీఐ మందిలించి పంపించాడు. పూజారులు, యువకు ల మధ్య బంధంపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు విచారణ ముమ్మరంగా జ రుగుతున్న నేపథ్యంలో రెండుమూడు గ్రామాల్లోని యువకులు భయం భయంగా గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారని గ్రామస్తుల నుంచి సమాచారం. ఈ దుస్సంఘనపై పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరిస్తున్నట్లు సమాచారం.