జడ్చర్ల, ఫిబ్రవరి 5: కందుల ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి, సోమవారం ఏకంగా క్విం టాకు రూ.10వేలు దాటింది. గతేడాది రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలికిన కంది ఈసారి రూ.10వేలకు చేరింది. ఈ ఏడాది వానకాలంలో అనుకూలమైన వర్షాలు కురవక పోవడంతో కందిపంటలు దెబ్బతిన్నాయి. దాంతో దిగుబడులు గణనీయంగా తగ్గడంతో కందికి డిమాండ్ పెరిగింది.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం కంది క్వింటాకు గరిష్ఠంగా రూ.10,069, కనిష్ఠంగా రూ.7,083, మధ్యస్తంగా రూ.10,020 ధర పలికింది. వేరుశనగకు గరిష్ఠంగా రూ.7,387, కనిష్ఠంగా రూ.3,514, మధ్యస్తంగా రూ.7,289 ధర పలికింది. అలాగే ఉ లువలు క్వింటాకు రూ.7,139, బెబ్బర్లు క్వింటాకు రూ.7,108, జొన్నలు క్వింటాకు రూ.5652, ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.3,115, హంస రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,680 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.