బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం కందికి అత్యధికంగా రూ.10,183 ధర పలికింది. మార్కెట్కు 85 క్విం టాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠం గా రూ. 10,183, కనిష్ఠంగా రూ.9,840, మధ్యస్తంగా రూ.10,182 ధర లభించింది.
కందుల ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి, సోమవారం ఏకంగా క్విం టాకు రూ.10వేలు దాటింది. గతేడాది రూ.6 వేల నుంచి రూ.7 వేలు పలికిన కంది ఈసారి రూ.10వేలకు చేరింది. ఈ ఏడాది వానకాలంలో అనుకూలమైన వర్షాలు కురవక పోవడంతో కందిపంట�