బాలానగర్, ఫిబ్రవరి 18 : గొంతులో ఎ ముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిర్మలాయకుంటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. మహబూబ్‌గర్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్ (49) తన మిత్రుడు కాట్రావత్ శివరాజ్‌తో కలిసి బాలానగర్ మండలంలోని తిర్మలాయకుంటతండాలో సోమవారం జరిగిన ఓ వివాహానికి హా జరయ్యాడు.
జహంగీర్ విందు భోజనం చే స్తుండగా గొంతులో ఎముక ఇరుక్కొని హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆయనను వెంట నే బాలానగర్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. మృతుని భార్య జయమ్మ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించారు.