దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), సెప్టెంబర్ 4 : చిన్నచింతకుంట మండలకేంద్రంలో వారం రోజులుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారు. చిన్నచింతకుంట గ్రామ శివారులోని వాగు నుంచి బోరుద్వారా మోటర్ల సా యంతో తాగునీటిని సరఫరా చేసేవారు. అయి తే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరుబావులు పూడుకుపోవడంతోపాటు మోటర్లు నీ టిలో కొట్టుకుపోయి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
దీంతో పంచాయతీ అధికారు లు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం మొత్తంలో 14 వార్డులు ఉండగా పం చాయతీ అధికారులు కేవలం నాలుగైదు ట్యాంకర్ల నీటిని సరఫరా చేసి చేతులు దులుపుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అ న్ని వార్డులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మల్దకల్, సెప్టెంబర్ 4 : మండలంలోని పె ద్దతండా గ్రామ పంచాయతీలో తాగునీటి ఎద్ద డి నెలకొన్నది. తమ సమస్యను చెప్పుకొందామంటే కనీసం పంచాయతీ కార్యదర్శి కొన్ని రోజులుగా గ్రామానికి రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా మరోవైపు తాగునీరు లేక అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రో జులుగా గ్రామంలోని వాటర్ ట్యాంక్ నుంచి నీటి సరఫరా చేయకపోవడంతో చేతిపంపులు, వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమస్యను కనీసం కార్యదర్శికి అయినా చెప్పుకుందామంటే కొన్ని రోజులుగా గ్రామ
పంచాయతీకి రాకపోవడంతో కార్యాలయం కూడా తెరిచేనాథుడు లేడని వాపోతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ విషయంపై ఎంపీడీవో ఆంజనేయరెడ్డిని వివరణ కోరగా నెలరోజుల్లో మూడు సార్లు గ్రామాన్ని తనిఖీ చేశామని కార్యదర్శి అక్కడే ఉన్నాడని చెప్పారు. అయితే తాగునీ టి సమస్య ఉందని ఈ రోజే తెలిసిందని, వెం టనే కార్యదర్శిని గ్రామానికి వెళ్లాలని ఆదేశించామని, రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.