పెంట్లవెల్లి, జనవరి 27 : కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. అధికార పార్టీ నాయకులు కొద్ది రోజుల కిం దట ప్రవేశపెట్టిన పెంట్లవెల్లి సింగిల్‌విండో సొసైటీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. శనివారం సంబంధిత అధికారుల సమక్షంలో నిర్వహించిన ప్రక్రియ వీగిపోయింది. ఎక్సైజ్ శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు అధికార దా హంతో విండో పీఠంపై కన్నేశారు. ఎలాగైనా డైరెక్టర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. కానీ డైరెక్టర్లు మాత్రం ప్రలోభాలకు గురిచేసినా.. కేసీఆర్ చూపిన ఉద్యమ స్ఫూర్తితోపాటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వెన్నంటే ఉం డి ధైర్యం నూరిపోశారు. సహకార సంఘానికి మొ త్తం 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. బీఆర్ఎస్కు సం బంధించి ఎనిమిది మంది ఉండగా.. కాంగ్రెస్‌కు చెందిన వారు ఐదుగురు ఉన్నారు.
అయితే బీఆర్ఎస్లో ముగ్గురికి డబ్బులు ఆశచూపి తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. ఇందులో భాగం గా వారం కిందట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు జిల్లా కేంద్రంలోని డీసీవో పాత్యానాయక్కు కాపీని అందించారు. కాగా, శుక్రవారం మధ్యా హ్నం ఒంటి గంట వరకు అవిశ్వాసానికి కాల వ్య వధి నిర్ణయించారు. గడువులోగా ఎవరూ రాకపోవడంతో అనంతరం మీడియా సమావేశం నిర్వహించి అవిశ్వాసం వీగినట్లు డీసీవో ప్రకటించారు. పాత చైర్మన్ విజయరామారావునే కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వు లు జారీ చేశారు. హస్తం పార్టీ కుతంత్రా న్ని బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. దీంతో జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది.
బీఆర్ఎస్ సంబురాలు
సహకార సంఘానికి ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగడంతో బీఆర్ఎస్ శ్రే ణులు సంబురాల్లో మునిగిపోయారు. ప్రజా పాలన అం టూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పామని పలువురు నాయకులు పేర్కొన్నారు. పెంట్లవెల్లి మండలం లో ప్రజాప్రతినిధులు చూపిన తెగు వ రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తం గా మొదలు కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. కా గా, అవిశ్వాస తీర్మానం అట్టర్ ఫ్లాప్ కావడంతో సింగిల్ విండో సొసైటీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు పటాకులు కాల్చుతూ ర్యాలీ ని ర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేత లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని సక్రమంగా అమ లు చేయలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ‘కాంగ్రెస్’కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో కొండూరు, మ ల్లేశ్వరం ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, ఈశ్వరికుమారి, తడకలవారి తండా సర్పంచ్ దేవమ్మ, నాయకులు నరసింహ, రామచంద్రనాయుడు, కురుమయ్య, కురుమూర్తి, వెంకటస్వామి, రాముడు, భూపతి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.