పెద్దకొత్తపల్లి, నవంబర్ 14 : కూర్చునేందు కు కూర్చీ కావాలా.. అయితే రూ.800లు చెల్లించాల్సిందే.. లేదంటే కింద కూర్చోవాల్సిం దే.. ఇదేం విడ్డూరమని అనుకుంటున్నారా.. ఇదెక్కడో హోటల్లోనో.. లేదంటే ఇంకే ప్రైవేట్ ప్రదేశంలోనో అనుకుంటే పొరపాటే.. సాక్షా త్తు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులంలో ప్రిన్సిపాల్ పెట్టిన నిబంధన. కుర్చీలో కూర్చోవాలంటే డబ్బులు ఇచ్చి కొనాల్సిందేనని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారు. పిల్లల బాధలు చూడలేక కొందరు తల్లిదండ్రులు డబ్బులు పెట్టి కుర్చీలను కొనుగోలు చేయగా.. కూలీ చే స్తే తప్పా పూట గడవని పేద విద్యార్థులు కుర్చీలను కొనుగోలు చేయలేక అవమానంతో కింద కూర్చుంటున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ గురుకులంలో చోటుచేసుకున్నది.
పెద్దకొత్తపల్లి ఎస్పీ గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 506 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, విద్యార్థులు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో ప్రిన్సిపాల్ అకూల్ ఎక్కడా లేని విధంగా కొత్త నిబంధన తీసుకొచ్చారు. రూ.800లు చెల్లించి కుర్చీ కొనుగోలు చే యాలని ఆదేశించారని విద్యార్థులు ఆ రోపించారు. దీంతో కొందరు తల్లిదండ్రులు త మ పిల్లల బాధలను చూడలేక 110 మందికి కుర్చీలను కొనుగోలు చేశారు. మిగతా విద్యార్థులు కొనుగోలు చేసేందుకు ఆర్థికస్థోమత లేకపోవడంతో కొనుగోలు చేయలేదు. దీంతో కుర్చీ కొనుగోలు చేసిన విద్యార్థులు కుర్చీల్లో కూర్చోగా, డబ్బులు లేక కొనుగోలు చేయని మిగతా వారు కింద కూర్చొని అవమానంగా ఫీల్ అవుతున్నారు. పేద విద్యార్థుల కోసం ఏ ర్పాటు చేసిన గురుకులంలో అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి విద్యార్థులతోనే వస్తువులు కొనుగోలు చేయించడం ఎంత వరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పం దించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి ఇ బ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నా రు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అకూల్ను వివరణ కోరగా.. విద్యార్థుల ఇష్ట ప్రకారమే కుర్చీలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కుర్చీల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.