మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న గొర్రెల పరిశోధన కేంద్రం స్థల విషయంలో ఇన్నాళ్లుగా నెలకొన్న ఆరోపణలకు చెక్ పడింది. పరిశోధన కేంద్రంలో ఉన్న పదెకరాలను కోర్టు కాంప్లెక్స్‌కు కేటాయించారు. కోర్టు భవనానికి ఇచ్చిన పదెకరాలకు బదులు 20 ఎకరాలు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించడంతో అధికారులు స్థల పరిశీలన చేసి నివేదిక సిద్ధం చేశారు. దీంతో గొర్రెల పెంపకందారులను తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు చేసిన కుట్రలకు తెరపడింది.
మహబూబ్‌నగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న గొర్రెల పరిశోధన కేంద్రాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏండ్లుగా ఉన్న అతి పెద్ద గొర్రెల పరిశోధన కేంద్రాన్ని తరలిస్తున్నారని, ఉన్న జాగాలన్నీ ఇతర డిపార్ట్మెంట్లకు కేటాయిస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తూ గొల్లకురుమలు, యాదవులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశోధన కేం ద్రం స్థలంలో కొంత భాగాన్ని కోర్టు కాంప్లెక్స్‌కు కేటాయించారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు ఇటీవలే పదెకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ స్థలం పశుసంవర్ధక శాఖ పరిధిలో ఉండగా, జిల్లా అధికారులు పరిశీలించి న్యాయస్థానం కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పగించారు. అయితే, దీనిపై కొందరు రా ద్ధాంతం చేసి గొర్రెల పెంపకందారులను తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నారు. గొల్లకురుమ, యాదవ సంఘాల ముసుగులో కొందరు చేసిన ప్రయత్నాలకు అధికారులు చెక్ పెట్టారు. గొర్రెల పరిశోధన కేంద్రాన్ని మరింత పట్టిష్టం చేయడంతోపాటు కోర్టు భవనానికి ఇచ్చిన పదెకరాలకు బదులు 20 ఎకరాలు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించడంతో అధికారులు స్థ ల పరిశీలన చేసి నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే గొర్రెల పరిశోధన కేంద్రం ఉంటుందని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని తేల్చిచెప్పారు.
గొర్రెల పరిశోధన కేంద్రానికి మరిన్ని హంగులు..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిప ల్లి వద్ద ఉన్న గొర్రెల పరిశోధన కేంద్రానికి అదనపు హంగులు అద్దేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఈ పరిశోధన కేంద్రానికి పట్టణ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. 1952లో డెక్కన్ గొర్రెల పెంపకానికి అవసరమైన పరిశోధనలు చేయడానికి సుమారు 270 ఎకరాలను కేటాయించారు.
తెలంగాణ ప్రాంత వాతావరణంలో పెరిగే డెక్కన్ గొర్రెల పెంపకం దాదాపుగా అం తరించిపోతున్నది. వీటి స్థానంలో బలిష్టం లేని ఇతర రాష్ర్టాల గొర్రెల పెంపకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రోత్సహించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా పరిశోధనలు చేసి వీటి ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భా వించి.. భూములు కేటాయించింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి గొర్రెల పరిశోధన కేంద్రాన్ని అనుబంధంగా మార్చారు. ఆ తర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధం చేసి దీన్ని అస్థిత్వాన్ని కోల్పోయేలా చేశారు.
తెలంగాణ వచ్చాక పీవీ నర్సింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చింది. అప్పటికే 2008లో పాలమూరు యూనివర్సిటీ, నిర్మితి కేంద్రం, వ్యవసాయ శాఖ కా ర్యాలయం, పశుసంవర్ధక శాఖ కార్యాలయ భవనాలకుగానూ గొర్రెల పరిశోధన కేంద్రానికి చెందిన స్థలాల ను కేటాయించారు. దీనిపై అప్పట్లో ఏ సంఘాలూ అ భ్యంతరం చెప్పలేదు. మిగిలిన 50 ఎకరాల్లో గొర్రెల పరిశోధన కేంద్రం, పశు సంవర్ధకశాఖ పాలిటెక్నిక్ క ళాశాల ఉన్నది. అయితే, ఇక్కడ పరిశోధన కేంద్రం ఉన్నట్లు ఎవరికీ తెలియదు.
కోర్టు కాంప్లెక్స్‌కు కేటాయించడంతో..
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాల కాంప్లెక్స్‌లో దాదాపు 16 న్యాయస్థానాలు ఉన్నాయి. చాలీచాలని వసతుల మధ్య కొనసాగుతున్నది. అన్నీ చిన్న చిన్న గదుల్లో ఉండడంతో ఎక్కడ ఏ కోర్టు ఉం దో తెలియక కక్షిదారులు అయోమయానికి గురవుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో కేసులు బెంచీల మీ దకు వస్తుంటాయి. కక్షిదారులు, అడ్వకేట్లను పిలిచే పి లుపులతో దద్దరిల్లుతుంది. ఏ కోర్టులో పిలిచారో తెలియక తికమకపడుతుంటారు. ఈ క్రమంలో విశాలమై న స్థలంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భావించి ప్రభుత్వానికి నివేదించారు.
బండమీదపల్లిలో ఉన్న గొర్రెల పరిశోధన కేంద్రంలో వృథా గా ఉన్న పదెకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గతంలో అనేక ఎకరాలు దా నం చేసినా పట్టించుకోని ఉత్తుత్తి సంఘాల నాయకు లు తెరమీదకొచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు పదుల సం ఖ్యలో కబ్జాలు చేసినా పట్టించుకోని చోటామోటా నా యకులు ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెట్టారు. కోర్టు కాంప్లెక్స్‌కు ఇచ్చిన స్థలానికి బదులుగా ఏకంగా మరో పదెకరాలు కలుపుతూ మహబూబ్‌నగర్‌లో వేరేచోట గొర్రెల పరిశోధన కేంద్రానికి 20 ఎకరాలను అప్పగించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. అయితే, గొర్రెల పరిశోధన కేంద్రం మాత్రం ఇప్పుడు ఉన్న చోటే ఉంటుంది. అదనంగా ఇచ్చే స్థలంలో గొర్రెలకు సంబంధించిన మేత, పునరుత్పత్తి వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో జిల్లా పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి ఆరోపణలకు తెరదించారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతలు..
మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతున్నది. అభివృద్ధికి ఆకర్షితులై అనేక మంది బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడానికి క్యూకడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏదో ఒక పనిగట్టుకొని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రజలే మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేని దుస్థితిలో ఉన్న ఈ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
పరిశోధన కేంద్రం ఎక్కడికీ తరలిపోదు..
వెటర్నరీ, పాలిటెక్నిక్, పశు పరిశోధన కేంద్రం తరలిపోతుందని కొందరు దుష్ప్రచారం చే స్తున్నారు. దీనిని ఎక్కడికీ తరలించం. అక్కడే ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమనాలు వద్దు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవనం కాంప్లెక్స్‌కు పదెకరాల ను కేటాయించాం. దీనికి బదులుగా 20 ఎకరాల స్థలాన్ని పశుపరిశోధన కేంద్రానికి ఇస్తున్నాం. ఇంచుభూమి కూడా ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడుతాం. పాలమూరు జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలపడమే నా లక్ష్యం. ఎవరెన్ని ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
– డా.వి.శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి