మక్తల్ టౌన్, నవంబర్ 26 : ప్రభుత్వ దవాఖానలో చి కిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు రోగులపై నిర్లక్ష్యం వహించకుండా వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల ప్రభుత్వ దవాఖానను శనివారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చికిత్స కోసం వచ్చే రోగులు సేద తీరేందుకు దవాఖాన ఆవరణలో షెడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. చేపట్టాల్సిన స్థలంలో భారీ వృక్ష్యం ఉన్నందున దానిని తొలగించేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి పనులు చేయాలని సిబ్బందిని ఆదేశించా రు. రూ.10 లక్షల ప్రత్యేక నిధులతో షెడ్డు నిర్మాణం, మరుగుదొడ్ల అభివృద్ధి, సిమాంక్ దవాఖానపై కప్పు మరమ్మతులకు నిధులకు కేటాయించామన్నారు. పనులను వేగవం తం చేయాలని మున్సిపల్ ఏఈ నాగశివకు సూచించారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును ఎమ్మె ల్యే నివాసంలో మండలంలోని మనాయకుంట గ్రామానికి చెందిన చంద్రమ్మకు రూ. 10,500ల చెక్కును లబ్ధిదారురాలుకు అం దజేశారు.
ఆర్థికాభివృద్ధి కోసమే దళితబంధు
రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకురావడం జరిగింద ని ఎమ్మెల్యే అన్నారు. దళితబంధు పథకం నుంచి మంజూరైన మండలంలోని గుర్లపల్లి గ్రామానికి చెం దిన జెట్టి కిష్టమ్మకు సెంట్రింగ్ (ఇంటి నిర్మాణ సామగ్రి) యూనిట్‌ను ఎమ్మెల్యే లబ్ధిదారుడికి అందజేశారు. దళితబంధు పథకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు.
మాదాసి కుర్మలను ఎస్సీ జాబితాలో చేర్చాలి
రాష్ట్రంలోని మాదాసి కుర్మ కులస్తులను ఎస్సీ జాబితా ల్లో చేర్చి ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని మండల మాదాసి కుర్మ కులస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాదాసి కుర్మలను ఎస్సీ జాబితాల్లో చేర్చే అంశాన్ని ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిప ల్ కమిషనర్ మల్లికార్జునస్వామి, డాక్టర్లు పార్వతి, నిఖిత, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకలు తదితరులు పాల్గొన్నారు.