గద్వాల, సెప్టెంబర్ 4 : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పీఈటీలను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పార్ట్‌టైమర్లను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేండ్లుగా గురుకులాల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో తమను విధుల్లోకి తీసుకున్నారని, తరగతుల నిర్వహణ, సూపర్విజన్స్, సెల్ఫ్స్టడీస్, హాలిడే సమయాల్లో విధులు నిర్వర్తించామన్నారు. కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలో కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రతిరోజూ నలుగురు ఉపాధ్యాయులు రాత్రివేళల్లో విధులు నిర్వర్తించి విద్యార్థుల భద్రత, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు మూడు నెలల జీతాలు ఇవ్వలేదని, కుటుంబ పోషణ భారమైనా పనిచేస్తున్నామన్నారు.
ప్రభుత్వం తమ సేవలను గుర్తించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం ఏవో వీరభద్రప్పకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గురుకుల పార్ట్‌టైం ఉద్యోగులు వెంకటే శ్, గూడ్‌సాబ్, నాగరాజు, మద్దేశ్వరి, ప్రి యాంక, ఉమామహేశ్వరి, భారతి, బాబు, వెంకటేశ్వర్లు, నరేశ్, బలరాముడు, మునిస్వామి, రా జు, వెంకటేశ్వర్లు, వాణి, రేవతి, హుస్సేన్, దేవ న్న పాల్గొన్నారు.