అలంపూర్, జూన్ 24 : పాఠశాలలో సరిపడా పంతుళ్లు లేకపోతే మా పిల్లలకు చదువులు ఎవరు చెబుతారు.. ప్రైవేట్ పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెప్పారు. అలంపూరు మండలం సింగవరం-1లో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతో వెళ్లిన ఎంఈవో అశోక్‌కుమార్‌ను అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల లేమిపై నిలదీశారు. గత విద్యాసంవత్సరంలో సింగవరం-1 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 30మంది విద్యార్థులుండగా, ఈ విద్యా సంవత్సరం కేవలం 9మంది మాత్రమే మిగిలారు.
1-5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు. 5తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. ఇలా ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు ఏం నేర్చుకుంటారని అడిగారు. దీంవిద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయిస్తారని ఎంఈవో చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, శివశంకరాచారి, గ్రామస్తులు శ్రీనివాసులు, మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.