ఊట్కూర్ : మనల్ని కనిపెంచిన అమ్మ నాన్నలు దేవుళ్లతో ( Gods ) సమానమని మగ్ధంపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాజ్ ( HM Shivaraj) అన్నారు. నారాయణపేట జిల్లా మగ్ధంపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో శుక్రవారం తల్లిదండ్రులకు పాదపూజ ( Padapuja ) కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. సృష్టిలో తల్లిదండ్రులను మించిన దైవం లేదని, నవ మాసాలు మోసి, జన్మనిచ్చి ,లోకాన్ని చూపించే తల్లి కనిపించే దైవమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు లోకంలో ఏది సాటి లేదన్నారు. తల్లిదండ్రులను సేవించడం ద్వారాపుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సత్యమ్మ, ఉపాధ్యాయులు మహేష్, నర్మద, శ్రీదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.