కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలుగా తమకు వేతనాలు అందించడం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంచాయతీల పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీల పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు శుక్రవారం టోకెన్ సమ్మెకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలు, గ్రామాల్లో పనులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కనీస వేతనాలు చెల్లించాలని, అవికూడా ప్రతినెలా అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
– నమస్తే నెట్వర్క్