పీయూకు అరుదైన అవకాశం
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు తలమానికంగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ మరోసారి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జాతీయ స్థాయి ‘పీఎం ఉషా-మేరు’ సదస్సు నిర్వహించనున్నది. ఈ మేరకు కేంద్రం ఉ చ్ఛత్తర్ శిక్ష అభియాన్ (పీఎం ఉషా) పథకం కింద రూ.35లక్షల నిధులు కేటాయించింది. ఇది పాలమూరుకు మరో మైలురాయి కానున్నది.
- దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణకు అవకాశం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 31 : ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు తలమానికంగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ మరోసారి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జాతీయ స్థాయి ‘పీఎం ఉషా-మేరు’ సదస్సు నిర్వహించనున్నది. ఈ మేరకు కేంద్రం ఉ చ్ఛత్తర్ శిక్ష అభియాన్ (పీఎం ఉషా) పథకం కింద రూ.35లక్షల నిధులు కేటాయించింది. ఇది పాలమూరుకు మరో మైలురాయి కానున్నది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయా లు, పారిశ్రామిక రంగాల మధ్య సమన్వ యం, సహకారం, జ్ఞాన మార్పిడికి ఇది ఒక బృహత్తరమైన వేదికగా నిలవనున్నది.
ఈ సదస్సులో భాగంగా దేశవ్యాప్తంగా పీఎం ఉషా కింద రూ.100 కోట్ల నిధులు మంజూరైన 27 విశ్వవిద్యాలయాల ఉప కులపతు లు, ప్రతినిధులు తమ సంస్థల అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు, విద్యా సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాల్స్ ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల ఉత్త మ విధానాలు, అనుభవాలు, విజయ గాథలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుంది.
సదస్సు రెండోరోజు రూ.20కోట్ల పీ ఎం ఉషా నిధులు పొందిన విశ్వవిద్యాలయా ల ఉప కులపతులతో ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్, రూ.10కోట్లు, రూ.5కోట్ల నిధులు పొందిన విద్యా సంస్థల ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విజయవంతమైన పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఉంటాయని పాలమూరు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సమావేశా లు ఉన్నత విద్యారంగంలో నూతన అవకాశాలు, పరిశోధన విస్తరణ, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాలపై దృష్టి సారిస్తాయని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక సంస్థలతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకార సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
వివిధ పరిశ్రమలు, వి ద్యా సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకునే కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. దీని ద్వారా విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు, స్టాల్స్, పరిశోధన భాగస్వామ్యాలు విస్తరించే అవకాశం కలుగుతుంది. పీఎం ఉషా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసె ర్చ్ యూనివర్సిటీస్ కాంపోనెంట్ కింద ఎం పికైన ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల వీసీ లు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, విధా న నిర్ణేతలు ఈ సదస్సులో పాల్గొంటారు.
పాలమూరు ఖ్యాతిని ఇసుమడింపజేస్తాం..
దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఇ లాంటి ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించే అవకాశం పాలమూరు యూనివర్సిటీకి లభించడం విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది అత్యంత అరుదైన అవకాశం. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. పాలమూరుకు ఈ అవకాశం లభించడం ఎంతో గర్వకారణంగా ఉంది. జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించి జాతీయ స్థాయిలో పాలమూరు ఖ్యాతిని ఇనుమడింపజేస్తాం.
– జీఎన్.శ్రీనివాస్, వీసీ, పీయూ
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

