మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 27 : కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకే సరిపోయింది. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ‘పరిసరాల పరిశుభ్రత మనందరి కర్తవ్యం.. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ మలమూత్ర విసర్జనను ఉపేక్షించేంది లేదు..’ అంటూ నిత్యం ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. కానీ వారు విధులు నిర్వర్తించే చోటే అపరిశుభ్రత రాజ్యమేలుతున్నది. ప్రజల నుంచి వివిధ రకాలైన పన్నులు వసూలు చేయడంపై ఉన్న ధ్యాస.. కార్యాలయానికి వచ్చే వారికి మౌలిక వసతులు కల్పించకపోవడం విడ్డూరం.
నీటి సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లను వినియోగించకపోవడంతో శిథిలావస్థకు చేరా యి. కార్యాలయం ఆరుబయటే మలమూత్ర విసర్జన చేస్తున్నారు. స్త్రీల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ వా హనం ఉన్నా ఉపయోగం లేకుండా పో యింది. ఇదంతా మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని మున్సిపల్ కార్యాలయం గురించే.. అక్కడ మచ్చుకైనా పారిశుధ్యం కనిపించడం లేదనడానికి ఈ చిత్రాలే నిదర్శనం.. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి సిబ్బంది, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.
పదిరోజులుగా.. ఎక్కడి చెత్త అక్కడే..
జడ్చర్ల, ఆగస్టు 27 : జడ్చర్ల మున్సిపాలిటీలోని 16వ వార్డులో పది రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పడి ఉన్నది. స్టేట్‌బ్యాంకు ఏరియా, గంజ్, శివాజీనగర్ ప్రాంతాల్లో చెత్తను తొలగించకపోవడంతో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. చెత్తకుప్పల్లోనే కుళ్లిన వ్యర్థాలు కూడా వేయడంతో దుర్వాసన వెదజల్లుతున్నదని కాలనీవాసులు చెబుతున్నారు. చెత్తను తొలగించాలని కౌన్సిలర్ లలిత మున్సిపల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. మంగళవారం జడ్చర్ల మున్సిపాలిటీలో బో నాల పండుగ ఉన్నా.. చెత్తను తొలగించకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో దానిని తొలగించేందుకు జేసీబీని పం పించాలని కోరినా అధికారుల నుంచి ఎలాంటి స్పం దన లేదని కౌన్సిలర్ లలితానాగరాజు తెలిపారు.