మహబూబ్‌నగర్, నవంబర్ 15 : జనాభా మేరకు వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం అ వసరమైన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మ హబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి ప్రెస్మీట్లో మాట్లాడా రు. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వై ద్య సదుపాయాల కల్పనలో వెనుకబడి పోయిందన్నా రు. ఇది దేశ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చే సిందన్నారు. దేశంలో మెడికల్ విద్యకు సరైన అవకాశా లు లేక ఇతర దేశాలకు ఎంబీబీఎస్ కోసం వెళ్లి నానా పాట్లు పడుతున్నారని వివరించారు. ఉక్రెయిన్‌లో ప్ర స్తుతం యుద్ధ వాతావరణంతో ఎందరో ఎంబీబీఎస్ వి ద్యార్థులు కష్టాలు పడిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే తెలంగాణ ఏర్పడ్డాక వైద్య రంగానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. కేంద్రం వివక్ష చూపుతున్నా నూతనంగా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు చెప్పా రు.
రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం మూడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవని, నూతనంగా 20 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ ఘనతే అన్నారు. కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాలపై విద్యార్థులు ఆధారపడే పరిస్థితులు ఉండవన్నారు. వైద్యుల సంఖ్య పెరిగి మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో తొలి మెడికల్ కళాశాల మనదే కావడం మహబూబ్‌నగర్ జిల్లా వాసుల అదృష్టమన్నారు. హైదరాబాద్ తరహా మహబూబ్‌నగర్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో రూ.500 కోట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులను త్వరలోనే చేపట్టినట్లు తెలిపారు.
ప్రణాళికలతో పనులు ..
జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పాల్గొని మా ట్లాడారు. మినీట్యాంక్ బండ్‌ను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు. నెక్లెస్ రోడ్డు కు ఇరువైపులా, ఐలాండ్‌లో సుందరీకరణ పనులు కో సం ప్రభుత్వం రూ.49 కోట్లు విడుదల చేసిందన్నారు. సాగునీరును అందరికీ చేరువ చేసేందుకుగానూ జిల్లా లో 20 చెక్‌డ్యాంలు అదనంగా మంజూరైనట్లు తెలిపా రు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుంటే.. కొందరు రాజకీయ లబ్ధి కోసం, కుట్ర పూరితంగా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు వేసిన కేసులు పూర్తిస్థాయి లో పరిష్కారమైన వెంటనే పనులు పూర్తిచేస్తామన్నారు. పాలమూరు లిఫ్టనకు జాతీయ హోదాను కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ తుంగలో తొక్కిందన్నారు. దివిటిపల్లి ప్రాంతం ఇండస్ట్రీయాల్ కారిడార్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, పర్యాటక శాఖ కన్సల్టెంట్లు, అధికారులు ఉన్నారు.