మాగనూర్ (కృష్ణ), జూలై 15 : నదిలో సాగునీరు లేక వరి పంటలు బీటలు బారుతున్నాయి. కృష్ణ మండలంలోని కుసుమూపర్తి, ఐనాపూర్, గురుజాల్, సుకుర్లింగపల్లి, తం గిడిగి అడిఖానాపూర్ తదితర గ్రామాలు ప్రజ లు కృష్ణమ్మను నమ్ముకొని నదీ తీరప్రాంతా ల్లో వరి పంటలు సాగుచేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వానలు కురవక నదిలో సాగునీటి సరఫరా లేక రైతు లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో ఆశతో సాగు చేసిన వరి పంటలకు నీటి సరఫ రా లేక పంటలు ఎండిపోతున్నాయి. ఒక్కొ క్క రైతు దాదాపుగా 10, 20, 30, 40, 50 ఎకరాల చొప్పున వేల ఎకరాల్లో పంటలు సాగే చేస్తుండగా, వీటిని కాపాడుకునేందుకు రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి నీటి లభ్యత లేక రైతులు చేతులెత్తేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీలు ఖర్చులతో ఇ ప్పటికే లక్షల వెచ్చించిన రైతులు పంట చేతికోస్తుందో లేదో అని ఆందోళనలో ఉన్నారు.
భీమానదిని నమ్ముకొని ఐనాపూర్లో 100 ఎకరాల దాకా వరి పంటను సాగు చేశాం. అయితే నదిలో నీళ్లులేక , వర్షాలు లేక పంట లు పూర్తిగా ఎండుముఖం పట్టి భూమి బీటలు బారుతుంది. భీమా నదిపై ఉన్న కర్ణాటకలోని గూడుర్ డ్యామ్ తేరిస్తే తప్పా నదిలో నీళ్లు రావు. నీళ్లు రాకపోతే నాతోపాటు వందల మందికి చెందిన రైతుల పొలాలు పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే 100ఎకరాలకు దాదాపు రూ.13లక్షలకు పైనే రైతుల పెట్టుబడి పెట్టారు. కష్టకాలంలో రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.
– నాగేశ్వరావు, రైతు, ఐనాపూర్
నదిలో నీళ్లను నమ్ముకొని కుసుమూపర్తిలో 20ఎకరాల వరి పంట సాగు చేస్తున్నాను. మా కుటుంబం మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి బ తుకుతున్నాం. పంటలు పండించాక వచ్చే డబ్బులతోనే మా పూట గడుస్తుంది. ప్రతి ఏడాది లాగే ఈఏడాది కూడా అప్పులు చేసి వరి పంట సాగు చేశాను. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు కురవక పంటలు ఎండుపోతున్నాయి మంత్రి వాకిటి శ్రీహరి ఎలాగైనా కర్ణాటక రాష్ట్రంలోని అధికారులతో మాట్లాడి నదిలో నీళ్లు వదిలేలా చర్యలు తీసుకుంటే వేల ఎకరాల వరి పంటలు చేతికందుతాయి.
-మల్లేశ్, రైతు, కుసుమూపర్తి