కొల్లాపూర్ రూరల్, మే 16 : కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశా రు. గురువారం ప్రభు త్వం అన్ని రకాల ధా న్యానికి రూ.500 బోన స్ ప్రకటించాలని కోరుతూ కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.
ఈ సందర్భంగా పీఏసీసీఎస్ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీతోనే రైతులు ఎక్కువ శాతం వరి పంట వేశారని, ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. అనంతరం బోనస్ చెల్లించాలని కోరుతూ ఆర్డీవో నాగరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకుడు యాదన్నగౌడ్, నాయకులు, రైతులు ఉన్నారు.