గద్వాల/అయిజ/మక్తల్/దేవరకద్ర/శ్రీశైలం, సెప్టెంబర్ 1 : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతోపాటు జూరాలకు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీ వరద వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివా రం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,82,000 కూసెక్కులు నమోదు కాగా 45 గేట్లు ఎత్తి 3,88,683 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో 47,124 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 13,475 క్యూసెక్కులు నమోదైంది.
ఆర్డీఎస్ ఆనకట్టకు 6,658 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అ వుట్ ఫ్లో 6,020 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 638 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,72,739 క్యూసెక్కులు ఉం డగా, అవుట్ ఫ్లో 1,76,651 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,30, 000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,02, 250 క్యూసెక్కులు నమోదైంది. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సంగంబండ)కు వరద భారీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు ఆదివారం నాలుగు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
కో యిల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వర ద వస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రాజెక్టు అధికారులు 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చే శారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బం డర్పల్లి వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బండర్‌పల్లి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సం దర్శకుల తాకిడి పెరిగింది. శంకర సముద్రానికి కూ డా వరద వస్తుండడంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి ఎగువనుంచి 5,02,244 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లను ఎత్తి 4,06,242 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో గేట్లు, విద్యుదుత్పత్తితో కలిపి మొత్తం 4,74,305 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.