మూసాపేట, జూన్ 28 : మీరు జమ చేసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు రూ. లక్ష వచ్చాయని వాటిని మీ ఖాతాలో జమ చేస్తానని చెప్పి అకౌంట్లో ఉన్న రూ.57,650 స్వాహా చేసిన ఘటన మూసాపేటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్ మోసాలపై అధికారులు ఓ వైపు నిరంతరం చైతన్యం చేస్తున్నా మరో వైపు సైబర్ క్రైం నేరగాళ్లు మాత్రం ఓ మెట్టుపైనే ఉంటూ సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ నూతన పద్ధతుల్ల్లో డబ్బులు స్వాహా చేస్తున్నారు. అందులో ఒకటి మూసాపేటకు చెందిన బోయ లక్ష్మమ్మ కొన్నేళ్ల కిందట తపాలా శాఖలో ఇన్సూరెన్స్ డబ్బులు కట్టింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఇన్సూరెన్స్ డబ్బులు కిస్తూ కట్టడం మానేశారు.
అయితే శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి లక్ష్మమ్మకు ఫోన్ చేసి నీవు కట్టిన ఎల్ఐసీ డుబ్బలు ఈ రోజే తీసుకెళ్లాలని తెలిపారు. అందుకు మేం ఈ సమయంలో రాలేమని, రేపు ఉదయం వస్తామని చెప్పడంతో ఆ డబ్బులు మీరు ఈ రోజు తప్పిస్తే మాకు రావు అని, మీరు రాకుంటే నీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అకౌంట్‌కు వెస్తామని చెప్పడంతో నమ్మి అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఆమెకు రూ.24,000 వేలు జమ చేసినట్లు ఎస్ఎంఎస్ పంపించాడు. మళ్లీ ఫోన్ చేసి మీ ఖాతాలో ఎక్కువ డబ్బులు వస్తలేవు, వేరే అకౌంట్ ఇవ్వండి అని అనడంతో కుమారుడు శివ అకౌంట్ ఇచ్చారు. అతని అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో అతని అకౌంట్ పనిచేయడం లేదని, వేరే అకౌంట్ ఇవ్వాలని చెప్పడంతో అతని బంధువు అయిన మురళి అకౌంట్ ఇచ్చారు.
దీంతో మురళితో పోన్ మాట్లాడుతూ శివ మీ అకౌంట్ నెంబరు ఇచ్చాడు మీ ఖాతాలో మిగతా డబ్బులు మీ ఖాతాలో జమ చేయమని చెప్పారు వేయాలని అని అడిగితే వెయ్యండి అని చెప్పారు. అతని అకౌంట్ నుంచి అంతకు ముందే రాములు అకౌంట్‌కు రూ. 50 వేలు జమ చేసినట్లు ఉండడంతో మీ ఖాతాకు రావడం లేదని నీవు ఉదయం డబ్బులు పంపిన వ్యక్తి రాములుకు పంపుతానని, అతని నెంబర్ ఇవ్వమని అడిగినట్లు తెలిపారు. దీంతో అతను రాములు నెంబర్ ఇచ్చిన వెంటనే అతనితో మాట్లాడుతూ మురళి ఉదయం డబ్బులు వేశాడు కదా ఇంకా డబ్బులు వేయమని చెప్పాడని, మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నాను అని చెప్పడంతో వేయమని చెప్పాడు.
అయితే మీ గూగుల్‌పే.. లేదా పోన్ పే నుంచి నాకు కొంత డబ్బులు వేస్తున్నట్లు అక్షరాలలో రాసి పంపమని చెప్పాడు. దీంతో అతను రూ. 5 వేలు పంపుతున్నట్లు రాసి పంపడంతో వెంటనే అతని అకౌంట్ నుంచి రూ. 5వేలు కట్ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. వెంటనే ఇదేమిటని ప్రశ్నిస్తే మొత్తం డబ్బులు వేశాను. చూసుకో అనిచెప్పడంతో రాములు అకౌంట్ ఓపెన్ చేసి చూడడంతో ఉన్న రూ.45 వేలు కూడా కట్ చేసినట్లు తెలిపారు.
ఈ విషయంపై ఈ విధంగా జరిగిందని మురళిని రాములు అడగడంతో అతను సైబర్ క్రైం నేరగానికి ఫోన్ చేసి డబ్బులు వేస్తానని చెప్పి డబ్బులు ఎలా కట్ చేశావని అడగడంతో నీ అకౌంట్‌కు అన్నీ డబ్బులు వచ్చాయి అకౌంట్ ఓపెన్ చేసి చూడమని చెప్పపడంతో అకౌంట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అంతలోనే అతని అకౌంట్లో ఉన్న రూ.రూ.7650లు కూడా కట్ అయినట్లు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లోబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులు, మూసాపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.