దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు. సఫారీ టూర్లో భాగంగా సలే శ్వరం సాహసయాత్రకు ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ భావిస్తున్నది. అటవీ వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో జూలై నుంచి అక్టోబర్ వరకు మినహాయింపు ఇవ్వనున్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే నిత్యం 50 మందిని ఫరహాబాద్ చౌరస్తా నుంచి సలే శ్వరానికి తీసుకెళ్లనున్నారు. ఈ నెలాఖరున అమల్లోకి రానుండ డంతో భక్తులు, చెంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్, ఏ ప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లమలలోని లోతట్టు అటవీ ప్రాంతంలో కొలువైన లింగమ య్య దర్శనాన్ని ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఇకపై ప్రతిరోజూ కల్పించనున్నారు. ఏడాదిలో మూడురోజులు మాత్రమే దర్శనానికి అనుమతి ఉండగా భక్తులు చాలా ఇబ్బందులు పడేవారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని లోతట్టు ప్రాంతంలో కొలువైన లింగమయ్య లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. ఉగాది త ర్వాత వచ్చే పౌర్ణమికి ఒకరోజు ముందు, తర్వాత రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉండేది. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా ఈ ప్రాంతానికి పేరుంది. దట్టమైన అడవి గుం డా లోయల అందాలను చూస్తూ పాదయాత్రగా భక్తులు లింగమయ్యను దర్శించుకుంటారు. తె లంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం లక్షలాదిగా భక్తులు తరలొస్తారు. ఈనెల 5నుంచి 7వ తేదీ వరకు జరిగిన యా త్రలో లక్షల మంది రావడంతో నియంత్రించడం అధికారులకు కష్టతరమైంది. ఈ పరిస్థితులను గుర్తించిన కలెక్టర్ ఉదయ్‌కుమార్, అచ్చంపేట ఎ మ్మెల్యే గువ్వల బాలరాజు, అటవీశాఖ అధికారి రోహిత్ ప్రభుత్వానికి నివేదించారు. వివరించా రు. అటవీశాఖ ఆధ్వర్యంలో సఫారీ టూర్లో భా గంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు దర్శనంతోపాటు స్థానిక చెంచులకు ఉపాధి కల్పించేందుకు అటవీశాఖ చ ర్యలు తీసుకుంటోంది. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలమైన వానకాలంలో (జూలై నుంచి అక్టోబర్) నాలుగు నెలల పాటు ఈ యాత్రకు మినహాయింపు ఉండనుంది. మిగిలిన 8 నెలల్లో సఫా రీ టూర్లో భాగంగా సలేశ్వర లింగమయ్య దర్శ నం కల్పించనుండడంతో భక్తులు సంతోషం వ్య క్తం చేస్తున్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే రోజుకు 50మందిని ఫరహాబాద్ చౌరస్తా నుంచి సఫారీ టూర్లో భాగంగా సలేశ్వరానికి కూడా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియ నెలాఖరులో అమలులోకి రానున్నది.
భక్తుల సౌకర్యార్థం సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సఫారీ టూర్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న సఫారీ టూర్లో భాగంగా లింగమయ్య దర్శనానికి అనుసంధానిస్తున్నాం.