మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 6 : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్‌రాం అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, జాతి సమైఖ్యతకు కృషి చేసిన మహానుభావుడు జగ్జీవన్‌రాం అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఎన్నో పోరాటాలు చేశారని, దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, నాయకులు గిరిధర్‌రెడ్డి, రాంలక్ష్మణ్, నవకాంత్, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.