జడ్చర్ల, మార్చి 8 : క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే త్వరగా నయమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డా క్టర్ లక్షారెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మ హిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎన్ఆర్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో నిర్వహించిన మెగా క్యా న్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జడ్చర్లలోని డిగ్రీ కళాశాల మైదానంలో హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పా టు చేసిన శిబిరానికి పట్టణ ప్రజలతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు పరీక్షలు చేయించుకున్నారు. బ్రెస్ట్, గర్భాశయ, మూత్రాశయ, నోటి క్యాన్సర్‌తోపాటు ఇతర క్యాన్సర్లకు సంబంధించి డాక్టర్లు పరీక్షలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ మహిళల్లో ఏదైనా క్యాన్సర్‌కు సంబంధించి న అనుమానం ఉన్నవారికి ముందుగానే పరీక్షించి అం దుకు సంబందించిన చికిత్సలు చేయడంతో ఈ వ్యాధి ని అరికట్టవచ్చని సూచించారు. ఎవరికైనా క్యాన్సర్ ఉ న్నట్లు తేలితే వారికి వైద్యం అందిస్తామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాం ప్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మ న్ యాదయ్య, బీఆర్ఎస్ నేత శివకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ చైర్మన్లు లక్ష్మయ్య, మురళి, ముడా డైరెక్టర్లు రవిశంకర్, ఇమ్మూ, శ్రీకాంత్, ప్రీతం, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, ఉమాదేవి, సర్పంచుల సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.