ఎండాకాలం వచ్చేసింది. వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఒంటిపూట బడులను నిర్ణయించింది. బుధవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆఫ్డే స్కూల్స్ ప్రారంభంకానున్నాయి.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. దీంతో ఊష్ణతాపం నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనున్నది. అయితే ‘పది’ విద్యార్థులకు యథావిధిగా స్పెషల్ క్లాస్లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉండనున్నాయి. ఉపాధ్యాయులు ఉదయమే పాఠశాలలకొచ్చి ప్రార్థన, ఇతర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నది. దీంతోపాటు ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం అందజేయాల్సి ఉంది.
నాగర్కర్నూల్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఎండాకాలం నేపథ్యంలో విద్యార్థులకు ఒంటిపూట బ డులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం బుధవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఎండాకాలం ఆరంభంలో నే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది వాతావరణం విభిన్నంగా ఉండనున్నది. పగటి వేళల్లో ఎం డలు అధికంగా ఉంటుండగా.. రాత్రిళ్లు చల్లగా ఉంటున్నది. దీంతోపాటు పెద్దలు, వృద్ధులు జ్వరం, చలి వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉపశమనం కల్పించనున్నది. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగనున్నాయి. ఉ పాధ్యాయులు ఉదయమే పాఠశాలలకు వచ్చి యథావిధిగా ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం పాఠశాల వదిలిన తరువాత త ప్పనిసరిగ్గా మధ్యాహ్న భోజనం అందజేయాలి. దీనిపై ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు జరుగనుండడంతో ప్రత్యేక తరగతులు యథావిధిగా నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు నిర్వహించాలి. ఈ ఆదేశాలు ప్రభుత్వ విద్యా సంస్థలతోపాటు ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగ్గా పాటించాలని అధికారులు ఆదేశించారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 852 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. దాదాపుగా 69 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరూ ఒం టిపూట తరగతులకు హాజరుకానున్నారు. ఇక పదో తరగతిలో ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్ వంటి 295 పాఠశాలల్లో 10,572 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలను రాయనున్నారు. ఈ విద్యార్థులందరికీ మధ్యాహ్నం తరగతులు జరుగనున్నాయి.