దేవరకద్ర, డిసెంబర్ 30: మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఆక్టోపస్ రక్షణ విభాగం బృందం సభ్యులు విన్యాసాలు ప్రదర్శించినట్లు ఆక్టోపస్ రక్షణదళ డీఎస్సీ రామకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్ని అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును చుట్టుముట్టడం, విశ్రాంత అతిథిగృహంలోకి చొరబడటం, స్వాధీనం చేసుకోవడం వటి సంభవించిన సందర్భాల్లో ఆక్టోపస్ బృందాలు ఎలా ప్రతిఘటించడంతోపాటు ఉగ్రవాదులను తుదముట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మాక్‌డ్రిల్ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో దాదాపు 100మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మల్లికార్జున్, ఎస్సై భగవంత్‌రెడ్డి, ప్రాథమిక వైద్యురాలు షభానాబేగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.