అలంపూర్ చౌరస్తా, ఫిబవరి 23 : ఉండవల్లి మండలంలోని తక్కశిలకు చెందిన జోగు జయమ్మ కుమారుడు అనిల్(18) పదో తరగతి వరకు చదివి కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఎలాంటి పనులు చేయకుండా మద్యానికి బానిసై డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలంటూ తల్లితో వాదనకు దిగాడు.
తన దగ్గర డబ్బులు లేవని, పని చేయకుంటే డబ్బులు ఎలా వస్తాయని తల్లి కుమారుడిని మందలించింది. దీంతో అనిల్ క్షణికావేశంలో ఇంట్లోనే ఇసుప రాడుకు చీరతో ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ దవాఖానకు తరలించామన్నారు.