అలంపూర్ చౌరస్తా, సెప్టెంబర్ 1: బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటలు, ఉద్యమాలు చేసి అలుపెరగని ఉద్యమ నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామం లో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను కు టుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న పల్లెటూర్లో జన్మించి ఢిల్లీ వరకు రాజకీయ ప్రస్థానం సాగించిన మహోన్నతవ్యక్తి సుధాకర్‌రెడ్డి అని అన్నారు.
నల్గొండ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్ గళం వినిపించిన గొప్పనాయకుడు సురవరం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సీపీఐ పార్టీ తమ మద్దతూ ప్రకటించుడే కాకుండా ఢిల్లీలో అనేక చర్చలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేశారని అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎత్తిన ఎర్రజెండాను ఆఖరి వరకు వదల్లేదని, విద్యార్థి దశ నుంచే ఎన్నో ఉద్యమాలు చేసి జాతీయ కార్యదర్శిగా పార్టీలో ఎదిగిన గొ ప్ప వ్యక్తి సురవరం సుధాకర్‌రెడ్డి అని అన్నారు.
అనంతరం సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి మాట్లాడుతూ తమ పెద్దల ద్వారా వాసరసత్వంగా సం క్రమించిన నాలుగున్నర ఎకరాల ఆస్తిని పేదల ప్రయోజనాల కోసం ధారదత్తం చేయనున్నట్టు ప్రకటించారు. కా ర్యక్రమంలో సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెం కట్రెడ్డి, ఎంపీ అరుణ, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.