వనపర్తి టౌన్/భూత్పూర్, అక్టోబర్ 27 : రాష్ట్రం లో ఆటో డ్రైవర్ల జీవితాలను రేవంత్‌రెడ్డి ఆగం చేసిం డు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ని యోజకవర్గ పరిధిలోని రహ్మత్‌నగర్ డివిజన్లో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆటోలో ప్రయాణించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆటో కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మా జీవితాలు రోడ్లపై పడ్డాయని ఈఎంఐలు కట్టలేక, పిల్లలను చదివించుకోలేక నిత్యం నరకం చూస్తున్నామని, కేసీఆర్ హయాంలో మహారాజుల్లా బతికిన మేము నేటి రేవంత్‌రెడ్డి పాలనలో భిక్షం ఎత్తుకొని బతికే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామని, డ్రైవర్లకు జీవిత బీమా పథకం ఇస్తామని మోసం చేయడమే కాకుండా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉచిత బస్సు పథకం పెట్టి ఆటో కార్మికుల బతుకు చిద్రం చేసిందని విమర్శించారు. గిరాకీలు లేక ఈఎంఐలు కట్టలేక యజమానులు ఆటోలు అమ్ముకొని కా ర్మికులుగా మిగిలిపోయారని, చాలీచాలని సంపాదనతో పిల్లలను చదివించుకోలేక, భార్య బిడ్డలను పో షించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా 161మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ఆత్మహత్యలు కా వని ప్రభుత్వం చేసిన హత్యలు అని దుయ్య బట్టా రు. ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఆటోడ్రైవర్ కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.