భూత్పూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో నూతన పద్ధతులను ( New methods ) పాటించాలని ఎంఈవో ఉషారాణి ( MEO Usharani) కోరారు. శనివారం కెపాసిటీ బిల్డింగ్ ముగింపు సదస్సులో ఆమె ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు అక్షరాలతో పాటు విషయ పరిజ్ఞానం పెరిగే విధంగా బోధన చేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల చదువుల కోసం తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ప్రతినెల తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపితేనే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అనంతరం పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎంఈవో ఉషారాణిని సన్మానించారు. సీఆర్పీలు ఇక్రం, ఠాగూర్, నాగేందర్, ఆర్పీలు చంద్రశేఖర్ రెడ్డి, ఖాదరయ్య, రేఖా రాణి, శ్రీనివాసులు, ఆనంద్ రెడ్డి, పద్మనాభం, రాజమోహన్, ఇంతియాజ్, టీఆర్టీయూ మండల అధ్యక్షుడు సత్తూరు బాలరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, కొప్పోలు యాదయ్య, సాయిరాం గౌడ్, నరేందర్, దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.