ఆర్టీసీ వినూత్న ప్రయోగాలతో ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తున్నది. గతంలో నష్టాలతో అతలాకుతలమైన సంస్థ నేడు కుదురుకొని సరికొత్త ప్రయోగాలతో లాభాల బాటలో పయణిస్తున్నది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే కార్గో ద్వారా మెరుగైన సేవలందిస్తుండగా.. ప్రస్తుతం విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించారు. గ్రామా ల్లో 15 రోజులకోసారి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఆర్టీసీ బస్సు వేళలు, సరికొ త్త రూట్లు, ప్రయాణికుల సమస్యలను గుర్తించి పరిష్కరించనున్నారు. దీంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు సంస్థకు మేలు చేకూరనున్నది.
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 14; ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచడమే కాకుండా ప్రయాణికులకు, ఆర్టీసీకి వారధిలా పనిచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని గ్రామాలకు మొత్తం 282 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో నివసించే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లుగా, డిపో మేనేజర్లను ని యమించారు.
ప్రజలతో స్నేహపూర్వక సం బంధాలు ఉండి, స్వచ్ఛందంగా పనిచేసేందు కు ముందుకొచ్చిన వారిని తీసుకున్నారు. అ ధిక జనాభా కలిగిన గ్రామానికి ఒకరు, త క్కువ జనాభా కలిగిన రెండు, మూడు గ్రా మాలకు ఒక విలేజ్ ఆఫీసర్‌ను నియమించా రు. ఒక బస్ ఆఫీసర్‌కు ఐదు గ్రామాలకు ఎ క్కువ కేటాయించేందుకు వీల్లేదు. వీరు గ్రా మస్తులతో 15 రోజులకోసారి సమావేశమవుతారు. బస్సుల రాకపోకల వేళలు, కొత్తరూ ట్లు, కొత్త సర్వీసులు, ప్రయాణికుల సమస్యలను అధికారులకు తెలపాల్సి ఉంటుంది. ర ద్దీ ఎక్కువగా ఉంటే అందుకు అనుగుణంగా బస్సు ట్రిప్పులను పెంచుతారు. అలాగే వీరు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు,గ్రామపెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో పాటు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులకు ప్ర జారవాణా వ్యవస్థతో పాటు ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు. డిపో మేనేజర్ ప్రతి గ్రామ సర్పంచ్‌కు తమ విలేజ్ బస్ ఆఫీసర్ వివరాల ను తెలియజేస్తా రు. బాగా పనిచే సే విలేజ్ బస్ ఆ ఫీసర్లను ఆర్టీసీ అ ధికారులు మూ డు నెలలకోసారి అవార్డులను అం దజేసి సత్కరించనున్నారు.
మెరుగైన సేవలు అందిస్తాం..
ఆర్టీసీ ఆదాయం పెంచడమే కాకుండా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి గడపకు ఆర్టీసీ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించాం. ఈ వ్యవస్థను ప్రజలు వినియోగించుకొని ప్రోత్రహించాలి. ఆర్టీసీపై ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచేందుకు విలేజ్ బస్ ఆఫీసర్లు కృషి చేయాలి.
– వి.శ్రీదేవి, మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్