వరికి యూరియా దొరకక బీరు కలిపి నూకలు చల్లిన రైతు
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బారాకత్ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు చల్ల సైదులు 13 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. అందులో మూడు ఎకరాల వరకు ఎర్ర తెగులు వచ్చి పంట చేను ఎండిపోతుంది. ఆయనకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం..
మునగాల, ఫిబ్రవరి 10 : సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బారాకత్ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు చల్ల సైదులు 13 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. అందులో మూడు ఎకరాల వరకు ఎర్ర తెగులు వచ్చి పంట చేను ఎండిపోతుంది. ఆయనకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం, తెలిసిన వారి ద్వారా యూరియా బుకింగ్ కోసం ప్రయత్నించినా దొరకక పోవడంతో తీవ్ర నిర్వేదంలోకి వెళ్లాడు. పంటను ఎలాగైనా బ్రతికించుకునేందుకు చుట్టుప్రక్కల వాళ్ల సలహా మేరకు నూకల్లో మూడు బీర్లు కలిపి పొలంలో చల్లాడు.
బాధిత రైతు దీనిపై స్పందిస్తూ.. అన్నీ తెలిసిన వాళ్లకే యూరియా దొరకడం లేదని, ఇక తనలాంటి చదువురాని వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు. తమలాంటి చదువురాని రైతులు రూ.250 యూరియా కోసం రూ.20 వేల ఫోన్ కొనాలా? ఫోన్ వాడటం ఎలా? పఏద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలా ఇబ్బందులు పెట్టడం ఏంటని, తమలాంటి చదువురాని వారు వ్యవసాయం చేయొద్దా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లైన్లో నిలబడినప్పుడే తమకు యూరియా దొరికిందని, ఇప్పుడు అసలే దొరకడం లేదని వాపోయాడు. యూరియా దొరకకపోవడంతో చేసేది లేక నూకల్లో బీరు కలిపి పొలంలో చల్లినట్టు పేర్కొన్నాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Beer
- Munagala
- Suryapet News
- urea
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

