గద్వాలటౌన్, జనవరి 10 : తెలంగాణ సంస్థానాల వాస్తవ చరిత్ర, రెడ్ల వైభవం, చ రిత్రను నేటి భావితరాలకు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చరిత్రకారుడు కె ప్టెన్ పాండురంగారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గద్వాల, ప్రా గటూరు వంటి సంస్థానాల చరిత్రను తెలుసుకునేందుకు సోమవారం గద్వాలకు చేరుకున్నారు. మొదటిరోజు కోటలోని భూలక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకొని కట్టడాలను పరిశీలించారు.
పూడూరు సంస్థానంలో శిలలను గమనించారు. కాగా, మంగళవారం లింగంబావి, చొక్కంబావులను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి శాసనాలను తెలుసుకునేందు కు ప్రయత్నిస్తున్నామన్నారు. సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన క ట్టడాలు, ఆలయాలు, వైభవం, శిల్పకళా సంపదను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంస్థానాల చరిత్ర తెలిసిన వారు, శాసనాలు, చరిత్రపై అవగాహన ఉన్న వారు తమకు సహకరించాలని కోరారు. అనంతరం పాండురంగారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డిని రెడ్డి సే వా సమితి నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో రాజశేఖర్రె డ్డి, భాస్కర్‌రెడ్డి, రత్నసింహారెడ్డి, శ్రీరాంరెడ్డి, దేవేందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, రంగారెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.