నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో చోటుచే సుకున్న అక్రమాలు, అవినీతికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కుమ్మెర శివారులో వర్షాలకు మునిగిపోయిన వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయర్ పంప్‌హౌజ్‌ను సోమవా రం సాయంత్రం ఆయన సందర్శించారు. టన్నెల్లోకి వెళ్లి పంప్‌హౌస్‌లో నీట మునిగిన మోటర్లను, అక్కడ జరుగుతున్న పనితీరును పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నాగం మీడియాతో మాట్లాడారు. అక్రమ కల్లు దందా చేస్తున్న వ్యాపారీ ప్ర స్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు. కల్లులో నార్కోటిక్స్ కలుపుతూ.. విక్రయించడం దుర్మార్గమన్నారు. ఈ తంతంగం స్థానిక ఎ మ్మెల్సీ, ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతుందని అనుకోవడం పొరపాటన్నారు. నియోజకవర్గంలో కల్తీకల్లు, డ్రగ్స్, గంజాయిని అరికట్టాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉం డగా.. నియోజకవర్గంలో ఇసుకను తరలించేందుకు ప్రజలు ట్రాక్టర్ కిరాయి, లేబర్ చార్జీలు మాత్రమే చెల్లించే వారన్నారు.
ఇసుక విధానంతో ప్రభుత్వ ఖ జానాకు ఎలాంటి లాభం చేకూరలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే సంబంధీకులే ఉన్నట్లు తనకు సమాచా రం ఉందన్నా రు. ఇసుక తరలింపును ఒక్కరి చేతుల నుంచే నడిపించి ప్రజల నెత్తిన భారం వేస్తున్నారన్నారు. ఇసుక అక్రమాలపై ఎమ్మెల్యే సమీక్షకు రావాలన్నారు. నియోజకవర్గంలో చోటుచేసుకునే అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తానన్నా రు. వరి కొనుగోళ్ల టెండర్ల వ్యవహారం హైకోర్టు స్టే వరకు వెళ్లడం మంచిది కాదన్నారు. నాగర్‌కర్నూల్‌లో చెరువుల జోలికి వెళ్లడం కొందరికి బాధ కలిగించిందన్నారు. తన హయాంలో చెరువు నీళ్లు తా గేందుకు వీలుండేదని, నేడు మురుగంతా అందు లో చేరుతుందని వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి మురుగు నీళ్లు చెరువులోకి చేరకుండా మళ్లించాలని సూచించారు. కల్తీకల్లు, గంజా యి నియోజకవర్గంలో ప్రమాదకరంగా మారింద ని, అరికట్టకుంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల హస్తం ఉం దని భావించాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి కార్యకర్తలకు పైరవీలు చేయడమే కాకుండా పనిచేయాలని హితవుపలికారు. హైడ్రాతో నష్టపోయిన పేదలు, చిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకు లు రవి, పాండు, లక్ష్మయ్య, బాలగౌడ్, లక్ష్మయ్య, రాజవర్ధన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అర్జునయ్య, కుర్మయ్య, భీమయ్య, విష్ణుచారి, భీముడు, సత్యం, శంకర్, సు ధాకర్, రాజు, అహ్మద్ పాల్గొన్నారు.