నవాబ్‌పేట: అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డా.లక్ష్మారె డ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ అనారోగ్యంతో బాధ పడుతుండ గా స్థానిక నాయకుల సమాచారంతో విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి చంద్రకళ కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు.
చెక్కు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, పిట్టల రవి తదితరులు పాల్గొన్నారు.