బిజినేపల్లి, ఏప్రిల్ 29 : మండలంలోని వట్టెం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశపరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శనివారం నిర్వహించనున్న పరీక్షకు ఉమ్మడి జిల్లాలోని 60 పరీక్షా కేంద్రాల్లో 8,022 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నా రు. విద్యార్థులు హెడ్మాస్టర్తో సంతకం చేసిన హాల్‌టికెట్లతో పరీక్షకు హాజరుకావాలని, హెడ్మాస్టర్ సంతకం లేకుంటే తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు.