పాలమూరు, ఫిబ్రవరి 24 : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా కేం ద్రంలోని ఎదిర, గాంధీరోడ్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో జయశ్రీ, సైన్స్‌ఫోరం సభ్యులు షమీ ర్, రేవతి, అరుణమ్మ, ఉమ, శరత్, జనార్దన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, జయవర్ధన్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా సైన్స్ పోటీలు
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 24 : సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాదేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండలస్థా యి సైన్స్ పోటీలు నిర్వహించారు. సైన్స్ విభాగంలో క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, రంగోళి పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. క్విజ్ పోటీల్లో ఇంగ్లిష్ విభాగంలో పోలేపల్లి విద్యార్థిని చైతన్య, తెలుగు మీడియం విభాగంలో ఆ లూర్ విద్యార్థిని ఆఫ్రీన్ మొదటి స్థానంలో నిలిచారు. వ్యాసరచన పోటీల్లో గురుకుల పాఠశాల విద్యార్థి పి. చంద్రకాంత్, వల్లూర్ విద్యార్థిని పి.రుచిత, ఉపన్యాస పోటీల్లో బాదేపల్లి హైస్కూల్ విద్యార్థిని శ్రీవిద్య, ఆలూర్ విద్యార్థిని జి.తేజశ్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. రంగోళి పోటీల్లో బా దేపల్లి హైస్కూల్ ప్రథమస్థానం, కావేరమ్మపేట హైస్కూల్ రెండోస్థానంలో నిలిచింది. కార్యక్రమంలో హెచ్ఎం బాసిత్, ఉపాధ్యాయులు వివేక్, చంద్రకళ, భాగ్యమ్మ, ఫెరోజ్, మక్సూద్, యూసూఫ్, శ్రీనివాస్, సైన్స్ ఫోరం సభ్యుడు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లో..
దేవరకద్ర/రూరల్, ఫిబ్రవరి 24 : దేవరకద్ర, కౌకుంట్ల మం డలకేంద్రాల్లో పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సైన్స్‌ఫెయిర్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచ న, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను ప్ర దానం చేశారు. కార్యక్రమంలో కౌకుంట్ల పాఠశాల హెచ్ఎం అబ్దుల్ హక్, ఉపాధ్యాయులు సుమన్, అ నిల్‌కుమార్, సునీత, శ్రీనివాసులు, రమేశ్‌బాబు త దితరులు పాల్గొన్నారు.
అవగాహన పెంచుకోవాలి
భూత్పూర్, ఫిబ్రవరి 24 : సైన్స్‌పై ప్రజలు అవగాహన పెం చుకోవాలని సైన్స్‌ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు రేవతి అన్నారు. జిల్లా సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, ఉపన్యా సం, వ్యాసరచన, రంగోళి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాళిదాస్, చలపతి, లక్ష్మి, ఉమాదేవి పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 24 : అడ్డాకుల ఉన్నత పాఠశాలలో పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సైన్స్‌ఫోరం ప్రతినిధి జనార్దన్‌రెడ్డి, నోడల్ అధికారి రాణి మాలినీదేవి, హెచ్ఎంలు అరవింద్ ప్రకాశ్, నీలకంఠప్ప, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, ఫిబ్రవరి 24 : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పు రస్కరించుకొని మూసాపేట పాఠశాలలో మండలస్థాయి సైన్స్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం శివరాజు, ఉపాధ్యాయులు శివశరణప్ప, అరుణకుమారి, సరిత, వెంకట్రాములు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.