జడ్చర్లటౌన్, జూన్ 2 : 167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా డిజైన్ మారడంతో అంబేద్కర్ చౌరస్తా నుంచి పాతబజార్‌కు వెళ్లే రహదారి మూతబడుతుందన్నది కేవలం అపోహ మాత్రమే అని జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలోని గౌడ పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నుంచి జడ్చర్ల మీదుగా చేపడుతు న్న 167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మొదటగా జడ్చర్ల లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మం జూరయ్యిందన్నారు.
ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాతబజార్, నేతాజీ చౌ రస్తా ప్రాంతాల ప్రజల రవాణాకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అప్పట్లో జాతీయ రహదారుల సంస్థ అధికారులతో మాట్లాడి ఫ్లైఓవర్ బ్రిడ్జి ని ర్మాణానికి నిలుపుదల చేశామన్నారు. ఆ తర్వాత పట్టణ ప్రజల రవాణా సదుపాయం దృష్ట్యా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం లేకుండా రహదారి విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. రహదారి విస్తరణ పనుల నిమిత్తం అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న విగ్రహాల తరలింపు విషయం లో ఇటీవల జరిగిన సమావేశంలో జాతీయ ర హదారి పనుల డిజైన్ మారిందని, ఇక పాతబజార్‌కు వెళ్లే రహదారి మూతపడనుందని, త ద్వారా భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోతాయని కన్ఫ్యూజన్ ఏర్పడిందన్నారు.
ఈ విష యం తన దృష్టికి రాగానే జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి వివరాలను తెలుసుకోవటం జరిగిందన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో యథావిధిగా అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్కిల్ ఉంటుందని, అక్కడి నుంచి పాతబజార్‌కు వెళ్లేందుకు రహదారి సదుపాయం ఉందని అధికారులు తెలియజేసినట్లు చెప్పారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ వాహనాలు పాతబజార్ ప్రాంతానికి వెళ్లేలా రహదారి ఉంటుందని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పుడు ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్లేందుకు గానూ అంబేద్కర్ చౌరస్తా వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన విషయా న్ని వివరించారు. అంబేద్కర్ విగ్రహం నుంచే పాతబజార్‌కు వాహనాలు రాకపోకలు కొనసాగించేలా రహదారి ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదని చెప్పారు. అదేవిధంగా జాతీయరహదారి విస్తరణ పనుల్లో భాగంగా కేవలం జడ్చర్లలో ఇండ్లు కోల్పొయిన బాధితులకు పరిహారం అందలేదని చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు.
జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం 50 ఫీట్ల తర్వాత ఇండ్లు కోల్పోయిన వారికి మాత్రమే పరిహారం వస్తోందని, ఇందుకుగానూ కోదాడ నుంచి జడ్చర్ల వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా దాదాపు 10 పట్టణాల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులెవరికి పరిహారం అందలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం ఇప్పిస్తానని ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చెప్పటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
బాధితులకు పరిహారం అందించే విషయంలో తన సహకారం ఉంటుందని చెప్పారు. ప్రజల బాగు కోసం పనిచేయాలి తప్పా అన్నిట్లోనూ రాజకీయాలు చేయటం సరికాదని ఆయన హితవుపలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యా దయ్య, కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, నందికిశోర్గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మహేశ్, బీఆర్ఎస్ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు పిట్టల మురళి, నాయకులు, పా తబజార్ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.