శ్రీశైలం, జనవరి 29 : శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు బయల్దేరిన ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి ఐరన్ సేఫ్టీ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి నిలిచిపో వడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం నుంచి సుమారు 40 మందికిపైగా ప్ర యాణికులతో ప్రైవేటు హైర్ బస్సు(టీఎస్ 0376 (పీహెచ్బీ) మహబూబ్‌నగర్‌కు బయల్దేరింది. సున్నిపెంట దాటిన తర్వాత డ్యాం ఎడమగట్టు వ్యూ పాయింట్ మలుపునకు ముందు డ్రైవర్ వేగాన్ని నియంత్రించడంలో విఫలం కా వడంతో అదుపు తప్పి సిమెంట్వాల్ను బద్దలుకొట్టి ఐరన్ సేఫ్టీ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది.
మధ్యాహ్నం సమయంలో డ్యాంను వీక్షిస్తున్న యాత్రికులు ప్రత్యక్షంగా చూసి భయాందోళనకు గురై పరుగులు తీశారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. లోయను చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. యాత్రికుల చొరవతో బస్సును వెనక్కి తీసి ప్రయాణికులను తిరిగి అదే బస్సులో మహబూబ్‌నగర్‌కు తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.