మరికల్, జూలై 11: నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతిచెందాడు. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) బైక్‌పై మరికల్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మరికల్‌లోని తీలేరు స్టేజి వద్ద నారాయణపేట నుంచి నాగర్‌కర్నూల్ వెళ్తున్న కారు.. బైకును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదులో కారు డ్రైవర్‌పై కేసు నమోదుసి దర్యాప్తు చేస్తున్నామని మరికల్ ఎస్ఐ రాము తెలిపారు. ఈ ఘటనతో నార్లోనికుంటలో విషాదఛాయలు అలముకున్నాయి.