wakf lands | మాగనూరు (కృష్ణ), జులై 16: ప్రభుత్వాన్ని నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్ భూముల వేలంపాట నిర్వహించాడని కృష్ణ మండలం గుడపల్లి గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.
బుధవారం బుడబులూరు గ్రామ శివారులోని సర్వేనెంబర్ 818 (6.11) వక్ఫ్ భూముల వేలంపాట విషయంపై చుట్టుపక్కల రైతులకు గానీ ఆ గ్రామంలోని సంబంధిత వ్యక్తులకుగానీ ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా దేవిశ్రీ శాస్తి బయో ప్యూయాల్ ప్రైవేట్ లిమిటెడ్ మెట్రిక్ కంపెనీవారికీ కేవలం 65 వేల రూపాయలకు ఒక సంవత్సరంపాటు మాత్రమే వేలంపాట పాడి దక్కించుకున్నట్లు ఇంచార్జి తహసీల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే ఈ వక్ఫ్ భూములు రైతుల సమక్షంలో మాత్రమే వేలంపాట నిర్వహించాల్సి ఉండగా ఇక్కడ ప్రైవేట్ కంపెనీ వ్యక్తులు కేవలం ఒక నలుగురు సమక్షంలో మాత్రమే వేలంపాట నిర్వహించడంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు గుడెబల్లూరు గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.
రైతులకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎలా అప్పజెప్పుతారని గ్రామస్తులు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ శ్రీనివాసులు ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నం చేయగా అందుబాటులో రాకపోవడంతో కృష్ణ మండల ఎమ్మార్వో గ్రూప్ లో ప్రైవేటు వ్యక్తులకు ఈ వక్ఫ్ భూములు వేలంపాట నిర్వహించవచ్చా అనే విషయంపై ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారు.