నారాయణపేట టౌన్, ఏప్రిల్ 20 : కొవిడ్ ని యంత్రణకు అధికారులు, సర్పంచులు కఠిన చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం వెబ్‌నార్ ద్వారా వైద్య, పం చాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు, స ర్పంచులతో కరోనా నియంత్రణ చర్యలు, ఉపాధి హామీ, హరితహారం మొక్కల సంరక్షణపై అదన పు కలెక్టర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క రోనా కట్టడికి ప్రతిఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, 45 ఏండ్లు పూర్తయి న వారు టీకా తీసుకునే విధంగా గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అందు కోసం గ్రామాల్లో సర్పంచులు, పంచాయ తీ సెక్రటరీ, డీపీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, కౌన్సిలర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రా మాల్లో, మున్సిపాలిటీల్లో హైపోక్లోరైట్ ద్రావణం తో క్రమం తప్పకుండా శానిటేషన్ చేయించాల ని, ఫాగింగ్ చేయించాలని సూచించారు. గ్రామా ల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా తక్కువ ధరకే మాస్కులు అందజేస్తారన్నారు. ఎండల తీవ్రత ను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయమే వెళ్లి ఎండలు తీవ్రమయ్యే లోపు ఇం టికి చేరుకునేలా అధికారులు చర్యలు చేపట్టాల ని, గ్రామాల్లో, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పా టు చేయాలన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి వ నాల మొక్కలు చనిపోకుండా నీళ్లు పోయించాల ని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నా రు. జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ము న్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.