నారాయణపేట, జూన్ 11: నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై ఉక్కుపా దం మోపాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సి బ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసుల వివరాలు సీఐలు, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లలో రిపీటెడ్‌గా కేసులు నమోదైతే అలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు న మోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వీసీలో పేట ఎస్పీ చేతన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అరికట్టేందుకు వ్య వసాయశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ బృందాలతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కర్నాటక రాష్ర్టానికి నారాయణపేట జిల్లాకు మధ్య 5 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచామన్నా రు.
రైతు వేదికల వద్ద రైతులు నిర్వహించే సమావేశాలకు పోలీసులు వెళ్లి నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ వాట్సాప్ నెంబర్ 7901400100 కూడా ఏర్పాటు చేశామని, నకిలీ విక్రయదారుల సమాచారాన్ని ఈ నంబర్‌కు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే పట్టుకుంటున్నట్లు తె లిపారు. జిల్లాలో లూజ్, కాలం చెల్లిన విత్తనాలు అమ్మకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వీసీలో డీఎస్పీ మధుసూదన్‌రావు, ఎస్సైలు చంద్రమోహన్‌రావు, రాజు, టాస్క్‌ఫోర్స్ బృందం, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి
ఊట్కూర్, జూన్ 11 : ఉపాధి పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈసీ శ్రీనివాసులు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథంలో భాగంగా శుక్రవారం మండలంలోని కొల్లూరు చెరువు కట్టపై ఉపాధి కూలీలతో ముండ్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం వలసలను నివారించి కూలీలకు స్వగ్రామాల్లో పనులు కల్పించేందుకు ఉపాధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 7వ విడుత హరితహారం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ్‌నారాయణ, టీఏ నాగరాజు పాల్గొన్నారు.