నారాయణపేట, జూన్ 2 : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి వి ద్యాసాగర్ అన్నారు. బుధవారం పట్టణ శివారులోని సిం గారం చౌరస్తావద్ద డీఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ని మహిళలు తమ నైపుణ్యాలను, ప్రతిభను గుర్తించి వెలికి తీయడానికి స్కిల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలు తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ఉపాధి పొందడానికి మంచి అవకాశమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ గత ఏడాది కొవిడ్ సమయంలో మహిళా సంఘా ల ద్వారా ప్రత్యేక మాస్కులను తయా రు చేసి దేశ వ్యాప్తంగా విక్రయించి మ హిళలు ఉపాధి పొందారని తెలిపారు. మాస్కులు విక్రయించగా వచ్చిన లా భంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను నిర్మించినట్లు వివరించారు. ఈ సందర్భంగా నేతి విద్యాసాగర్‌తోపాటు ఎ మ్మెల్యేలు, అధికారులు మహిళా సం ఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ ని జాంపాషా, మున్సిపల్ ఛైర్పర్సన్ గందె అనసూయ, వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాస్కరకుమారి పాల్గొన్నారు.