మరికల్, ఏప్రిల్ 06: నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మాధవరం రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి (Parnika Reddy) దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భారీ ఊరేగింపు మధ్య స్వామి వారి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఎమ్మెల్యే దంపతులు, మరికల్ ఎస్ఐ రాము ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు.
యువకమండలి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
మరికల్ మండల కేంద్రంలో చౌరస్తా దగ్గర యువక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాందేవ్ బాబా ఫ్యాషన్ ఓనర్ జగదీష్ సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జగదీష్ తోపాటు మరికల్ యువకమండలి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సూర్య మోహన్ రెడ్డి, వీరన్న, హరీష్, గొల్ల కృష్ణయ్య, రామస్వామి, వీర బసంత్, సురిటి చంద్రశేఖర్, హచ్ శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, రాజు, ఆంజనేయులు, లంబడి రాములు, కేడీఆర్తోపాటు యువక మండల సభ్యులు పాల్గొన్నారు.