Makthal: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్ళాలి: ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌రూరల్: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపుని చ్చారు. శనివారం మక్తల్ మండలంలోని దాదాన్పల్లి, ముష్టిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.

మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ప్రభుత్వ ఫలాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నియోజక వర్గంలో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ(చిట్టెంనర్సిరెడ్డి) భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వా యిర్ల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. వానకాలం పంటలకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన కాల్వ లను యుద్ద ప్రాతిపధికన మరమ్మత్తులు చేయించి రైతులకు సాగునీటి ఇబ్బందులను తొలగించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యక్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.

పాఠశాల అదనపు గది నిర్మాణానికి భూమి పూజ
మండలంలోని ఉప్పరిపల్లి గ్రామంలో పాఠశాల అధనపు గది నిర్మాణానికి శనివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే ఖానాపూర్ గ్రామానికి చెందిన అంజనేయులుకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద రూ.45 వే లు, మక్తల్ పట్టణానికి చెంఇన అశోక్‌లకు చెక్కుల ను ఆయన అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, సర్పంచ్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ప్రధానోపాధ్యయుడు పరంధాములు మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు హుసేన్‌పాషా, మీడియా కన్వీనర్ ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

